Thu Dec 19 2024 18:31:22 GMT+0000 (Coordinated Universal Time)
Kamala Harris : కమలా హారిస్ దూకుడుకు ట్రంప్ గ్రాఫ్ పడిపోతుందా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బైడన్ బరి నుంచి తప్పుకుని కమలాహారిస్ ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ తీవ్రంగా ఉంది
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బైడన్ బరి నుంచి తప్పుకుని కమలాహారిస్ ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ తీవ్రంగా ఉంది. బైడెన్ బరిలో ఉన్నంత వరకూ ట్రంప్ వైపు మొగ్గు చూపిన అమెరికన్లు కమలా హారిస్ రాకతో పోటీ టైట్ గా మారింది. ఇప్పుడు నువ్వా? నేనా అన్నట్లు పోటీ మారిందని అనేక మీడియా సంస్థలు తమ సర్వేల ద్వారా వెల్లడిస్తున్నాయి. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టు కూడా కమలా హారిస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు పేర్కొనడంతో అధ్యక్ష ఎన్నికల్లో కమలా గెలిస్తే అమెరికాకు తొలి మహిళ అధ్యక్షురాలు అవుతారు.
వ్యక్తిగత విమర్శలకు దిగుతూ...
కమలా హారిస్ బరిలోకి దిగగానే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రసంగాన్ని మార్చారు. అప్పటి వరకూ బైడన్ విధానాలపై విమర్శలు చేసిన ట్రంప్ హారిస్ బరిలోకి దిగిన వెంటనే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఇది ఎక్కువ మంది అమెరికన్లకు నచ్చడం లేదని అంటున్నారు. కమలా హారిస్ విజయం వైపు దూసుకెళుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ కూడా తన స్పీడ్ ను పెంచారు. అయితే ట్రంప్ పై గతంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. కాని కమలా హారిస్ పై పాలనపరమైన విమర్శలు లేవు. కేవలం ఆమె భారతీయ సంతతి కుటుంబానికి చెందిన వ్యక్తిగానే ప్రచారం చేయడం మినహా మరొకటి డొనాల్డ్ ట్రంప్ చేయలేకపోతున్నారు.
ట్రంప్ ఎన్నికయితే...?
తాజాగా కమలా హారిస్ అమెరికన్లకు సరికొత్త వాగ్దానాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికయిన వెంటనే వలస విధానాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. దీంతో పాటు ఉక్రెయిన్ వంటి దేశాలత పాటు నాటో కూటమికి అండగా ఉంటానని కమలాహారిస్ హామీ ఇచ్చారు. ట్రంప్ పై కూడా కమల నిప్పులు చెరిగారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అరాచకాలేనని అన్నారు. దేశంలో అనేక పరిణామాలు సంభవిస్తాయని ప్రజలకు సూచించారు. దేశం మళ్లీ వెనక్కు వెళుతుందని ఆందోళన చెందారు. ట్రంప్ నిలకడలేని మనస్తత్వం కలిగిన వాడని, ఆయన తీసుకునే నిర్ణయాలు దేశభద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హారిస్ ప్రసంగించారు.
Next Story